: చిన్నారులను కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్న వ్యక్తి అరెస్ట్


చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా ఆట కట్టించారు గుంటూరు జిల్లా పోలీసులు. చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి వారిని రైళ్ళలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న ముఠాను రైల్వే పోలీసులు తెనాలిలో పట్టుకున్నారు. ముగ్గురు పిల్లల్ని పోలీసులు రక్షించారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ముగ్గురు పిల్లల్ని తీసుకు వెళ్తుండగా, పోలీసులు నేటి ఉదయం అరెస్ట్ చేశారు. చిన్నారులను హరీష్, గిరీష్, లహరిలుగా గుర్తించిన పోలీసులు, వీరు చీరాల ప్రాంతానికి చెందినవారిగా భావిస్తున్నారు. ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో శ్రీనివాస్ వారికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు కిడ్నాపర్ ను విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News