: ఆ ఆయిల్ పెయింటింగ్ ఖరీదు రూ.1,861 కోట్లు!
నిజమేనండోయ్, 18వ శతాబ్దానికి చెందిన ఓ ఆయిల్ పెయింటింగును ఖతార్ లోని ఓ మ్యూజియం కళ్లు చెదిరే ధరను చెల్లించి వేలంలో దక్కించుకుంది. దీంతో ఇప్పటిదాకా ఈ విషయంలో నమోదైన రికార్డు ధరలన్నీ బద్దలైపోయాయి. ఫ్రెంచ్ కళాకారుడు పాల్ గౌగెన్ గీసిన ఈ ఆయిల్ పెయింటింగును అక్షరాల రూ. 1,861 కోట్లు వెచ్చించి మరీ ఖతార్ మ్యూజియం దక్కించుకుంది. జెనీవాలో ఇటీవల జరిగిన వేలంలో ఈ పెయింటింగును దక్కించుకున్న ఖతార్ మ్యూజియం పేరు కాని, దాని యాజమాన్యం పేరు కాని వెల్లడి కాలేదు. అత్యంత రహస్యంగా వేలం జరగడంతో కొనుగోలుదారుల విషయంలో కొంత గందరగోళం నెలకొంది.