: నల్లధనంపై దర్యాప్తు షురూ... 60 మందిలో బడా పారిశ్రామికవేత్తలు!
నల్లధనంపై దర్యాప్తులో కేంద్రం మరింత వేగం పెంచింది. స్విట్జర్లాండ్ ప్రభుత్వ సహకారంతో ఆ దేశ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన 627 మంది భారతీయులకు సంబంధించిన జాబితాను సుప్రీంకోర్టుకు అందజేసిన ప్రభుత్వం, తాజాగా 60 మందిపై న్యాయపరమైన విచారణకు శ్రీకారం చుట్టింది. ఈ 60 మందిలో బడా పారిశ్రామికవేత్తలున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ 60 మందికి చెందిన విదేశీ బ్యాంకు ఖాతాల్లో రూ.1,500 కోట్ల మేర నల్లధనం మూలుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మరింత మేర సమాచారాన్ని రాబట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.