: తాండూరు పొలాల్లో కూలిన మానవరహిత విమానం... ఆరా తీస్తున్న పోలీసులు
ఒక రైతు పొలంలో అత్యాధునిక కెమెరా అటాచ్ చేసిన డ్రోన్ (మానవరహిత విమానం) కూలింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణంలోని మల్ రెడ్డిపల్లి కాలనీలో జరిగింది. ఓ రైతు పొలంలో నిన్న ఈ డ్రోన్ కనిపించడంతో, ఆశ్చర్యానికి లోనైన స్థానికులు, పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీయడానికి దీన్ని ఉపయోగిస్తారని గుర్తించి, బ్యాటరీలో చార్జింగ్ అయిపోవడంతో అదుపుతప్పి పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. వాతావరణ మార్పులు పరిశీలించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రయోగించి ఉండొచ్చని భావిస్తున్నారు.