: సూర్యోదయాన్ని మాత్రమే ముందుగా ఊహించగలం... కిరణ్ బేడీ ట్వీట్
'శుభోదయం ఢిల్లీ. ప్రతిరోజు ఒక కొత్త రోజు. స్థిరంగా, ముందస్తుగా వూహించగలిగేది సూర్యోదయం మాత్రమే' అంటూ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరపు ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆమె స్పందిస్తూ, కొన్ని నియోజకవర్గాల్లో పోటీ నువ్వా? నేనా? అన్నట్లు ఉన్నందువల్ల సర్వేల అంచనాలు తలకిందులయ్యే అవకాశముందని ఆమె తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ జయాపజయాలకు పూర్తి బాధ్యత తనదేనని బేడీ అన్నారు. భాజపా పరాజయం తప్పనిసరి అని గ్రహించిన తరువాతనే, ఓటమి మరకను మోదీపై పడనీయకుండా ఉంచేందుకే బేడీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.