: అర్ధరాత్రి వీరంగం చేసింది రామ్‌చరణే... పోలీసులకు ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ ఫిర్యాదు


శనివారం అర్ధరాత్రి రోడ్డుపై వీరంగం చేసి వార్తల్లోకెక్కిన హీరో రామ్‌చరణ్ తేజ్ అట. రోడ్లపై వీరి హల్ చల్ గురించి సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు. రామ్‌చరణ్ తేజ్ తన ఇంటి వద్ద స్నేహితులకు ఇచ్చిన విందులో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కొడుకు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడు, మరో ఇద్దరు స్నేహితులు పాల్గొన్నారు. అరుపులు, కేకలతో వారు స్థానికులకు చికాకు కలిగించారు. గౌతం సవాంగ్ ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు విందు కార్యక్రమాన్ని ఆపేయాలని రామ్‌చరణ్‌ను కోరగా అందుకాయన నిరాకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News