: ఆల్వాల్ లో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి


హైదరాబాదులోని ఆల్వాల్ లో ఇండిపెండెంట్ హౌస్ ని అద్దెకు తీసుకొని వ్యభిచార గృహం నడుపుతున్న నిర్వాహకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళకు చెందిన రోజీ అనే మహిళ అల్వాల్‌లోని సాయినగర్ కాలనీలో ఒక ఇండిపెండెంట్ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచార గృహం నడిపిస్తోంది. దీనిపై ఫిర్యాదులందుకున్న పోలీసులు, ఆ గృహంపై దాడిచేసి ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులు, నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు మహిళల్లో ఇద్దరు హైదరాబాదీలు కాగా, ఇంకొకరు సిద్ధిపేటకు చెందినవారిగా గుర్తించారు. వీరు 30 ఏళ్లలోపు వారేనని పోలీసులు వెల్లడించారు. వీరితో పాటు విటులు వెంకటరెడ్డి (50), యాదగిరి (30) లను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

  • Loading...

More Telugu News