: మాజీ ప్రేయసి బూట్లు తగులబెట్టినందుకు ఏడాది జైలు


మాజీ ప్రియురాలి బూట్లను, మంచాన్ని దగ్ధం చేసిన భారతీయుడికి దుబాయ్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. నిందితుడు ఏఆర్(26) మద్యం మత్తులో ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. దుబాయ్ లోని జుమీరాహ్ పామ్ ప్రాంతంలోని ఓ హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్న నిందితుడు, గతేడాది అక్టోబర్ లో అదే హోటల్ లో రిసెప్షనిస్ట్ గా పని చేస్తున్న మాజీ ప్రియురాలు ఫిలిపినా గదిలోకి ప్రవేశించి ఆమె బూట్లు, మంచానికి నిప్పుపెట్టాడు. ప్రియురాలి ప్రాణానికి అపాయం కలిగించేలా వ్యవహరించినందుకు, ఆమె వస్తువులకు, హోటల్ ఆస్తికి నష్టం కలిగించినందుకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం అతడికి ఏడాది జైలు శిక్ష విధించింది.

  • Loading...

More Telugu News