: కిరణ్ బేడీని ఎంచుకోవడం తప్పుడు నిర్ణయం:ఆర్ఎస్ఎస్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని ఎంచుకోవడం తప్పుడు నిర్ణయమని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ అనంతరం ఆర్ఎస్ఎస్ స్పందించింది. ఢిల్లీలో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ పై వ్యతిరేక ప్రచారం కూడా కొంపముంచిందని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. అలాగే ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని ఆర్ఎస్ఎస్ వెల్లడించింది. సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీని ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. దీంతో ఢిల్లీలో ఆప్ విజయం లాంఛనమేనని, ఓటమికి బీజేపీ సన్నద్ధమైనట్టు తెలుస్తోంది.