: ఆ రోజు హామీలకు వెంకయ్య, అరుణ్ జైట్లీ కమిటయ్యారు: బాబు


విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలకు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు కమిటయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ రోజు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వారిద్దరిపై ఉందని స్పష్టం చేశారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ ను చూడలేమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజనలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదు. దాని స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. ఆ లెక్కన విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను ఎవరు, ఎలా, నెరవేరుస్తారో చెప్పాల్సిన అవసరం ఉందని బాబు నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన, వ్యవసాయంపై రెండు టాస్క్ ఫోర్సులు వేయమని కోరామని ఆయన తెలిపారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం తక్కువగా ఉంటే, తెలంగాణలో ఆదాయం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ప్రధాని చొరవ తీసుకుని మూడు ఉపసంఘాలు నియమించారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News