: ముఖ్యమంత్రులు విలువైన సూచనలిచ్చారు: మోదీ
నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రులు విలువైన సమాచారం ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో నాలుగున్నర గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనకు చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలపై ముఖ్యమంత్రులు విలువైన సూచనలు ఇచ్చారని అన్నారు. సమాఖ్య స్ఫూర్తి దేశ పురోభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. విధానాల రూపకల్పన, సుపరిపాలన అందించడంపై ముఖ్యమంత్రులు దృష్టిపెట్టాలని ఆయన వారికి సూచించారు.