: కోహ్లీ ఔట్...టీమిండియా 154/2
టీమిండియా పేలవ ఫాం కొనసాగుతోంది. వరల్డ్ కప్ కు కొద్ది రోజులే మిగిలున్నాయి. తొలి ప్రత్యర్థి పాకిస్థాన్. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు చెత్త ఆటతీరుతో ప్రత్యర్థులకు నవ్వు తెప్పిస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తక్కువ స్కోర్లకు పెవిలియన్ చేరారు. దీంతో బ్యాటింగ్ భారం భుజంపై వేసుకున్న ధావన్, రహానే నిలకడగా ఆడుతున్నారు. 372 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే తడబడడంతో రెండు వికెట్లు కోల్పోయి 25 ఓవర్లలో 155 పరుగులు చేసింది. రహానే 66, ధావన్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు.