: కిరణ్ బేడీని కలిసిన నిర్మలా సీతారామన్
ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సమావేశమైన వీరిద్దరూ పోలింగ్ సరళి, ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీనే వరిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఫలితాలు ఈ నెల 10న వెలువడనున్న సంగతి తెలిసిందే.