: మురళీమోహన్ ఇంట్లో మరోసారి చోరీ


రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు, నిర్మాత మురళీమోహన్ తనయుడు మాగంటి రామ్మోహన్ ఇంట్లో వారంలో వరుసగా రెండు సార్లు చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇటీవల మురళీమోహన్ కుటుంబ స్నేహితురాలు శ్రీలంక నుంచి ఓ పెళ్లికి హాజరయ్యేందుకు హైదరాబాదు వచ్చి రామ్మోహన్ ఇంట్లో బస చేసింది. ఆమె తిరిగి శ్రీలంక వెళ్లే రోజున బ్యాగులోని 6 లక్షల రూపాయల విలువైన నగలు, విదేశీ కరెన్సీ చోరీకి గురైంది. ఆ కేసు దర్యాప్తు జరుగుతుండగానే మళ్లీ ఖరీదైన టీవీని ఆగంతుకులు దొంగిలించారంటూ రామ్మోహన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌ తో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. కాగా, రామ్మోహన్ ఇంట్లో వంట మనిషి, పని మనుషులు, డ్రైవర్‌ లను పోలీసులు విచారించారు.

  • Loading...

More Telugu News