: 371 పరుగులకు ఆసీస్ ఆలౌట్... టీమిండియా ముందు భారీ విజయలక్ష్యం
వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో ఆసీస్, టీమిండియాకు భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 48.2 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (104) స్ఫూర్తిదాయక బ్యాటింగ్ తో ఆదిలోనే హిట్టింగ్ ప్రారంభించిన ఆసీస్, ఆ తర్వాత కొంతసేపు స్తబ్ధుగా బ్యాటింగ్ చేసింది. అయితే గ్లెన్ మ్యాక్స్ వెల్ (122) వచ్చీ రావడంతోనే బ్యాట్ ను ఝుళిపించాడు. కేవలం 57 బంతుల్లోనే 122 పరుగులు చేసిన మ్యాక్స్ వెల్, ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఆరంభం, చివరలో మెరుగ్గా రాణించిన టీమిండియా బౌలర్లు మిడిల్ ఓవర్లలో చేతులెత్తేశారు. దీంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. మరికొద్దిసేపట్లో 372 పరుగుల విజయ లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించనుంది.