: మ్యాక్స్ వెల్ వీర విహారం... ఏడు వికెట్లకు ఆసీస్ స్కోరు 360
ఆసీస్ బ్యాట్స్ మన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ వీర విహారం చేశాడు. టీమిండియాతో అడిలైడ్ లో జరుగుతున్న వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో 57 బంతులను ఎదుర్కొన్న మ్యాక్స్ వెల్ 122 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతడు రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. తొలుత కాస్త మెరుగ్గానే రాణించిన టీమిండియా బౌలర్లు ఆ తర్వాత చేతులెత్తేశారు. 46 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లను కోల్పోయిన ఆసీస్ 360 పరుగులు చేసింది. అంతకుముందు ఓపెనర్ గా వచ్చిన డేవిడ్ వార్నర్ కూడా (104) సెంచరీ సాధించడంతో ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.