: అర్ధరాత్రి టాలీవుడ్ యువ హీరో, మిత్రుల వీరంగం... పోలీసుల మందలింపు


హైదరాబాదులోని జూబ్లిహిల్స్ లో టాలీవుడ్ యువ హీరో ఒకరు అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. మిత్రులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్లపైకి వచ్చిన అతడు హల్ చల్ చేశాడు. అర్ధరాత్రి వేళ నడిరోడ్డుపై ఈ వీరంగమేంటని ప్రశ్నించిన స్థానికులపై అతడు, తన మిత్రులతో కలిసి దాడి చేసినంత పనిచేశాడు. మమ్మల్నే ప్రశ్నిస్తారా? అంటూ యువ హీరో విలన్ లా ప్రవర్తించాడు. తనను ప్రశ్నించిన వారితో అతడు వాదులాటకు దిగాడు. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీనిని గమనించిన ఓ పోలీసు ఉన్నతాధికారి ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువ హీరో, అతడి మిత్రులను మందలించి అక్కడి నుంచి పంపించివేశారు. యువ హీరో మిత్ర బృందంలో ఎంపీలు, ఎమ్మెల్యేల సుపుత్రులున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News