: వార్నర్ సెంచరీ... భారీ స్కోరు దిశగా ఆసీస్
ఓ వైపు వికెట్లు పడుతున్నా, ఆసీస్ బ్యాట్స్ మెన్ పరుగుల వరద పారిస్తూనే ఉన్నారు. అడిలైడ్ లో నేటి ఉదయం ప్రారంభమైన వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో భాగంగా 35 ఓవర్లు ముగిసేసరికే ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 228 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 83 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఓ వైపు సహచర బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టినా, వార్నర్ మాత్రం భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారత బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ, మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మొహ్మద్ షమీ, అక్షర్ పటేల్ లు తలా ఓ వికెట్ చొప్పున పడగొట్టారు.