: ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ప్రధాని ఇంటికి చంద్రబాబు... నిధుల వేట ప్రారంభం
ఏపీ సీఎం చంద్రబాబు తన నిధుల వేటను ప్రారంభించారు. నేటి ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరిన ఆయన కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో విమానం దిగీదిగగానే కార్యరంగంలోకి దూకేశారు. విమానాశ్రయం నుంచే నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి ఆయన బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న నీతి ఆయోగ్ భేటీలో ఆయన పాలుపంచుకోనున్నారు. భేటీ అనంతరం ఆయన ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అవుతారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన తదితర అంశాలపై ఆయన మోదీతో చర్చించనున్నట్టు సమాచారం. రాష్ట్రానికి మరిన్ని నిధులను విడుదల చేయాలని కూడా ఆయన ప్రధానిని కోరనున్నారు.