: జూబ్లీ బస్టాండులో బాలుడి అపహరణ... మాయలేడి కోసం మూడు పోలీసు బృందాలు
హైదరాబాదులోని జూబ్లీ బస్టాండులో నేటి తెల్లవారుజామున నెలన్నర వయసున్న బాలుడు అపహరణకు గురయ్యాడు. తల్లి ఒడిలోని బాలుడిని ఆడిస్తానంటూ తీసుకున్న ఓ గుర్తు తెలియని మాయలేడి, ఆ తల్లి కళ్లెదుటే బాలుడితో పరారైంది. దాంతో కన్నీరుమున్నీరైన కరీంనగర్ కు చెందిన రజిత, మారెడ్ పల్లి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పిల్లాడితో అదృశ్యమైన మాయలేడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఆమె కోసం మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.