: హేట్ స్పీచ్...అక్బరుద్దీన్ ను వెంటాడుతోంది: ముంబై కోర్టు తాజా సమన్ల జారీ
మత సంబంధిత అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఓ వర్గం మనోభావాలను కించపరచిన మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ తెలంగాణ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీని కోర్టు కేసులు ఇప్పుడప్పుడే వీడేలా లేవు. ఎప్పుడో 2012లో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదుతో పాటు కొద్ది రోజుల పాటు ఆయన జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. తాజాగా ముంబైలోని కుర్లా సబర్బన్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఇదివరకే అక్బరుద్దీన్ కు తాము జారీ చేసిన సమన్లను అందించడంలో పోలీసులు విఫలమయ్యారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసారైనా నిందితుడికి సమన్లను అందజేయండంటూ ముంబై పోలీసులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.