: నితీష్ ఎన్నిక రాజ్యాంగ వ్యతిరేకం... రాష్ట్రపతి పాలన విధించండి: రామ్ విలాస్ పాశ్వాన్


బీహార్ అసెంబ్లీలో జేడీయూ శాసనసభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నిక కావడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆరోపించారు. బీహార్ లో నెలకొన్న రాజకీయ అస్థిరతను తొలగించేందుకు రాష్ట్రపతి పాలన విధించాలని, లేకపోతే వీలైనంత త్వరలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వ్యక్తి లేకుండా శాసనసభాపక్ష సమావేశం ఎలా నిర్వహిస్తారని పాశ్వాన్ ప్రశ్నించారు. నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ లు దళిత వ్యతిరేకులు అంటూ పాశ్వాన్ మండిపడ్డారు. ఇంతకు ముందే పాశ్వాన్ కు చెందిన కులాన్ని మహాదళిత్ కేటగిరీ నుంచి నితీష్ కుమార్ తొలగించారు. ఇప్పుడు దళితుడైన మాంఝీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంతో పాశ్వాన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ ఏడాది నవంబర్ నెలాఖరుకల్లా బీహార్ అసెంబ్లీ టర్మ్ ముగుస్తోంది.

  • Loading...

More Telugu News