: టీఆర్ఎస్ కు కాంగ్రెస్ భయం పట్టుకుంది: డీకే అరుణ
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామిక రీతిలో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ భయం పట్టుకుందని, అందుకే కాంగ్రెస్ నేతలపై పోలీసులతో దాడులు చేయిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్న విషయం టీఆర్ఎస్ నేతలు తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీపై టీఎస్ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, రోజుకో కథ చెబుతున్న టీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.