: ధోనీ అత్యంత సహనం కలిగిన వ్యక్తి అంటూ కితాబిచ్చిన మాజీ కెప్టెన్
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ ప్రశంసల జల్లు కురిపించారు. అత్యంత సహనం కలిగిన వ్యక్తి ధోనీ అని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా శాంతంగా వ్యవహరించగలడని కొనియాడారు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయాల్లో కూడా ధైర్యంగా ఉండటం ధోనికి ఉన్న మరో ప్రత్యేకత అని చెప్పారు. టీమ్ లో ఉన్న ఆటగాళ్లందరితో చక్కటి సమన్వయం ఏర్పరుచుకుని, జట్టును ముందుకు నడిపించగల సత్తా ధోనికి ఉందని అన్నారు. ఈ ప్రపంచకప్ లో టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని, కప్ సాధించగల అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు.