: కేజ్రీవాల్ కే జై కొట్టిన ఢిల్లీ ఓటర్లు... ఎగ్జిట్ పోల్స్
ఢిల్లీ శాసనసభకు పోలింగ్ ముగియడంతో వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడిస్తున్నాయి. వీటిలో ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ వైపే మొగ్గు చూపినట్టు స్పష్టమవుతోంది. మచ్చలేని కేజ్రీవాల్ ముందు మోదీ చరిష్మా పనిచేయలేదని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి. ఇండియా టీవీ - సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం... ఆప్ కు 35, బీజేపీ 31, కాంగ్రెస్ కు 2 సీట్లు రానున్నాయి. ఇతరులు మరో 2 సీట్లను కైవసం చేసుకోనున్నారు. ఎన్డీటీవీ అంచనాల ప్రకారం... ఆప్ 38, బీజేపీ 29, కాంగ్రెస్ 3 స్థానాలను కైవసం చేసుకుంటాయి. ఇండియా టుడే-సిసిరో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం... ఆప్ 35 నుంచి 43 స్థానాల వరకు గెలుచుకోనుంది. బీజేపీ 23 నుంచి 29, కాంగ్రెస్ 3 నుంచి 5 సీట్లను కైవసం చేసుకుంటుంది. ఏబీపీ - నీల్సన్ అంచనా ప్రకారం... ఆప్ కు 39, బీజేపీి 28, కాంగ్రెస్ కు 3 సీట్లు రానున్నాయి. యాక్సిక్ ఎగ్జిట్ పోల్స్ అయితే ఆప్ కు భారీ మెజారిటీ వస్తుందని అంచనా వేసింది. ఆప్ ఏకంగా 53 స్థానాలను గెలుచుకుంటుందని, బీజేపీ 17 స్థానాలకే పరిమితం అవుతుందని వెల్లడించింది. కాంగ్రెస్ కు 2 సీట్ల వరకు దక్కే అవకాశం ఉందని తెలిపింది.