: అవనికి అన్నయ్యలు వీరే...!


మనిషి ఆవాసానికి యోగ్యయైన గ్రహాలను అన్వేషించడంలో శాస్త్రవేత్తలు కొన్నేళ్ళుగా తలమునకలై ఉన్నారు. నాసా ఇలాంటి ప్రాజెక్టుల పట్ల ఆసక్తి కనబరచడమే కాకుండా స్వంతంగా పరిశోధనలు సైతం నిర్వహిస్తోంది. తాజాగా ఓ పరిశోధనలో ఒక సౌర మండలాన్ని గుర్తించారు నాసా శాస్త్రవేత్తలు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ, రెండు భూమిని పోలిన గ్రహాలు దర్శనమిచ్చాయి. ఇంకేముంది, ఎగిరిగంతేశారు పరిశోధకులు!

కెప్లర్ టెలిస్కోప్ సాయంతో ఈ సూపర్ ఎర్త్ లను కనుగొన్నారట. వీటిని సూపర్ ఎర్త్ లని ఎందుకు పిలవాలంటే, పరిమాణ రీత్యా ఇవి భూమి కంటే ఎంతో పెద్దవని పరిశోధనకు నాయకత్వం వహించిన విలియం బొరుకి అంటున్నారు. కాగా, ఆ గ్రహాలపై నీరు ప్రవహించేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని నాసా అంచనా వేస్తోంది. ఇంకేం, గ్రహాంతర కాలనీల నిర్మాణానికి అమెరికా వంటి అగ్రరాజ్యాలు సిద్ధమవుతాయేమో చూడాలి!.

  • Loading...

More Telugu News