: ఏపీలో విగ్రహాల తొలగింపు రాజకీయ కక్షే... తిరుపతి ఎన్నికలో మద్దతివ్వడం లేదు!: అంబటి


ఏపీ రహదారుల వెంబడి ఉన్న విగ్రహాలు, ఫ్లెక్సీలు 15 రోజుల్లోగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. రాజకీయ కక్షతోనే విగ్రహాలు తొలగిస్తున్నారని ఆ పార్టీ ఏపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఇది సాకుగా చేసుకుని దివంగత వైఎస్ ఆర్ విగ్రహాలు తొలగించినా, తరలించినా కార్యకర్తలు, అభిమానులు చూస్తూ ఊరుకోరని మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఏదో దురుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తే ప్రతిఘటిస్తామన్నారు. ఎన్టీఆర్ ను విగ్రహంగా మార్చింది ఆయన కాదా? అని ప్రశ్నించారు. ఇక తిరుపతి ఉపఎన్నికలో తమ పార్టీ ఎవరికీ మద్దతివ్వడం లేదని, టీడీపీ అభ్యర్థికి మద్దతిచ్చినట్టు కొన్ని ఛానల్స్ లో అవాస్తవ ప్రచారం జరుగుతోందని అంబటి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News