: జేడీయూ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితీష్... పార్టీ నుంచి మాంఝీ తొలగింపు
బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి పగ్గాలు చేపట్టేందుకు మాజీ సీఎం నితీష్ కుమార్ కు మార్గం సుగమమయింది. కాసేపటి క్రితం జరిగిన జేడీయూ పార్టీ సమావేశంలో... ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనికి కొన్ని గంటల ముందు ముఖ్యమంత్రి మాంఝీ మంత్రివర్గ సమావేశం నిర్వహించి, శాసనసభను రద్దు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. జేడీయూ శాసనసభాపక్ష నేతగా నితీష్ ను ఎన్నుకోవడమే కాకుండా, జేడీయూ నుంచి మాంఝీని తొలగించేశారు. దీంతో, మాంఝీ ముఖ్యమంత్రి పదవిని కోల్పోతుండటమే కాకుండా, ఏకంగా పార్టీకి కూడా దూరమయ్యారు.