: ఈ రాత్రి బీజేపీ ఉన్నతస్థాయి సమావేశం
ఈరోజు రాత్రి 7 గంటలకు బీజేపీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. అందుబాటులో ఉన్న నేతలతో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా భేటీ కానున్నారు. ఢిల్లీ ఎన్నికల పోలింగ్, తదితర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు ఢిల్లీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 51.15 శాతం పోలింగ్ నమోదైంది.