: అసెంబ్లీ రద్దు కోరాలని బీహార్ మంత్రివర్గ నిర్ణయం


బీహార్ లో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించబోతున్నారన్న వార్తల నేపథ్యంలో జితన్ రాం మాంఝీ ఈరోజు అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. 2/3 శాతం మంది మంత్రులు ఆయన్ను వ్యతిరేకిస్తూ, మాజీ సీఎం నితీశ్ కుమార్ కు వారంతా అనుకూలంగా ఉన్నారు. దాంతో అసెంబ్లీని రద్దు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ రద్దు కోరుతూ రాష్ట్ర గవర్నర్ ను కలిసే అవకాశముందని తెలుస్తోంది. అటు త్వరలో మాంఝీ రాజీనామా చేస్తారని సమాచారం. మరోవైపు నేడు నితీశ్ కుమార్ ను పాట్నాలోని ఆయన నివాసంలో మాంఝీ కలిశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తీసుకునే చర్య కీలకమవుతుంది!

  • Loading...

More Telugu News