: ఏపీలో వృద్ధాప్య పెన్షన్ల పంపిణీలో దొంగనోట్ల కలకలం
ఆంధ్రప్రదేశ్ లో దొంగనోట్ల కలకలం చోటుచేసుకుంది. వృద్ధాప్య పెన్షన్ల పంపిణీలో కొంతమంది బాధితులకు దొంగనోట్లు వచ్చాయి. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెంలోని లబ్ధిదారులకు అందిన పెన్షన్ లో వెయ్యి రూపాయల దొంగనోట్లు వచ్చినట్టు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. దాంతో నకిలీనోట్లు వెనక్కి తీసుకొన్న అధికారులు అసలు నోట్లు పంపిణీ చేశారు.