: కిరణ్ బేడీపై ఆప్ ఫిర్యాదు
ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్ధి కిరణ్ బేడీపై ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా తన నియోజకవర్గం కృష్ణా నగర్ లో బేడీ పాదయాత్ర చేసి, ఓట్లు వేయాలని అడిగినట్టు ఆప్ ఆరోపించింది. ఇలా చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టేనని ఈసీకి తెలిపారు. అయితే బీజేపీ ఈ విషయాన్ని సమర్ధించుకుంటోంది. ఇది ఎప్పటిలాగే చేసే ఎక్సర్ సైజ్ అని చెబుతోంది. అయినప్పటికీ ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. కాగా, అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యర్ధి, న్యూఢిల్లీ నియోజకవర్గ నూపుర్ శర్మ మాట్లాడుతూ, తను, తన మహిళా కొలీగ్ పై ఆప్ కార్యకర్తలు దౌర్జన్యం చేశారని చెప్పారు. ఆప్ మహిళా వ్యతిరేక పార్టీ అని విమర్శించారు.