: ఢిల్లీలో ఓటింగ్ 70 శాతం దాటే అవకాశం ఉంది: చీఫ్ ఎలక్షన్ కమిషనర్
ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతంగా జరుగుతోందని, ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగుతోందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35 శాతం పోలింగ్ నమోదయిందని... సాయంత్రానికల్లా ఓటింగ్ 70 శాతం దాటుతుందని వెల్లడించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరింపజేశామని... అందువల్ల ఎలాంటి సమస్యలు తలెత్తలేదని పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలైన్లో ఉన్నవాళ్లందరికీ... ఎంత సమయమైనా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు.