: ఇప్పట్లో రైల్వే ఛార్జీలు పెంచే ప్రతిపాదన లేదు: కేంద్ర మంత్రి


బడ్జెట్ సమావేశాల్లో త్వరలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇప్పట్లో రైల్వే ఛార్జీలు పెంచే ప్రతిపాదన లేదని కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. లక్నోలో ఈరోజు లక్నో-ఖాట్మండు కొత్త ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన, బడ్జెట్ పెట్టకముందే చర్చించడం సరికాదన్నారు. పార్లమెంటులో రైల్వే బడ్జెట్ పై చర్చిస్తారన్నారు. ఇదే సమయంలో రైల్వే ఛార్జీలు పెంచడం లేదని చెప్పారు. ఈ నెల 26న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News