: అమెరికాను ప్రగతిపథంలో తీసుకెళడానికి శాయశక్తులా కృషి చేస్తా: అజయ్ బంగా
ఒబామా ప్రభుత్వం ప్రవాస భారతీయులకు పెద్ద పీట వేస్తోంది. తాజాగా, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల సలహాదారుడిగా ప్రవాస భారతీయుడు అజయ్ బంగా నియమితులయ్యారు. ప్రస్తుతం అమెరికా-భారత్ వాణిజ్య మండలి ఛైర్మన్ గా పనిచేస్తున్న బంగా... అమెరికా జాతీయ వాణిజ్య విధాన సంప్రదింపుల కమిటీ సలహాదారుగా నియమితులైనట్టు వైట్ హౌస్ ప్రకటించింది. బంగా లాంటి ప్రతిభావంతుల సేవలను ఉపయోగించుకోవడం సంతోషకరమని తెలిపింది. దీనిపై స్పందించిన అజయ్ బంగా, అమెరికాను ప్రగతిపథంలో తీసుకెళడానికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.