: తెలంగాణలో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తాం: మంత్రి తుమ్మల


మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి తెలంగాణలో కొత్త సచివాలయం అంశంపై రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. సచివాలయాన్ని నిర్మించి తీరుతామని అన్నారు. కానీ ప్రతిపక్షాలు వేరే పనిలేక తమపై విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. నూతన సచివాలయాన్ని ఎలా నిర్మించుకోవాలో తమకు తెలుసునని ఆయన చెప్పారు. కారణం లేకుండా ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తున్నారన్న తుమ్మల, ప్రజామోదం ఉంటేనే పర్యటించాలని, లేదంటే ప్రజలు ఛీ కొడతారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News