: అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ... ప్రత్యేక ప్యాకేజీ, పన్ను మినహాయింపులపై చర్చ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితమే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఆయన సమావేశం ముగిసింది. ఈ భేటీలో ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, వినోద్ లు కూడా పాల్గొన్నారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ, పునర్విభజన చట్టం ప్రకారం పన్ను మినహాయింపులు తదితర అంశాలపై వీరు చర్చించారు. దీనికి తోడు, టీఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టుకు కూడా కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కేసీఆర్ కోరారు.

  • Loading...

More Telugu News