: వీణా-వాణీలకు ఆపరేషన్ చేయవచ్చని నిర్ధారణకు వచ్చాం: లండన్ వైద్యులు
అవిభక్త కవలలు వీణా-వాణీలకు ఆపరేషన్ చేయవచ్చని నిర్ధారణకు వచ్చామని లండన్ గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్యులు డునావే, జిలానీ వెల్లడించారు. వారికి పరీక్షలు నిర్వహించాక ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. హైదరాబాదు నీలోఫర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు వారు మాట్లాడారు. ఈ శస్త్రచికిత్సకు లండన్ లోని వైద్యశాల అనుకూలమని, దాదాపు విజయవంతమవుతుందని అనుకుంటున్నామని వివరించారు. పదేళ్ల క్రితం ఒకసారి, నాలుగేళ్ల క్రితం మరొకసారి అవిభక్త పిల్లలను విడదీశామని వివరించారు. అవిభక్త పిల్లలకు ఆపరేషన్ చేసేందుకు లండన్ ఆసుపత్రి అనుకూలమని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు.