: ముందు ఆట, తరువాతే పాప... వరల్డ్ కప్ ముగిశాకే బిడ్డను చూస్తానన్న ధోనీ
ఒక పాపకు తండ్రి అయిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, మరో నెలన్నర తరువాతనే కన్న బిడ్డను చూడనున్నాడు. తన తొలి ప్రాధాన్యం క్రికెట్ ఆటకేనని, ఆ తరువాతే కుటుంబమని ధోనీ తెలిపాడు. 'పాపను చూడటానికి ఈ మధ్యకాలంలో ఇండియాకు వెళ్లాలనుకుంటున్నారా?' అని ఓ విలేకరి ప్రశ్నించగా 'నాకు కూతురు పుట్టింది. సాక్షి, పాప ఇద్దరు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. నేను ప్రస్తుతం జాతీయ జట్టుకు ఆడుతున్నాను. వరల్డ్‌కప్ అనేది భారత్ కు అత్యుత్తమమైనది. నా మొదటి ప్రాధాన్యం క్రికెట్‌కే, ప్రపంచకప్ ముగిసిన తర్వాతే భారత్ వెళతాను' అని చెప్పాడు. 'ముందు ఆట, తరువాతే పాప' అన్న ధోనీని మెచ్చుకొని తీరాల్సిందే!