: తిరుపతిలో టీడీపీకి మద్దతు పలికిన వైఎస్సార్సీపీ
తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ నగర కమిటీ కన్వీనర్ పాలగిరి ప్రతాపరెడ్డి టీడీపీ అభ్యర్థి సుగుణమ్మకు సహకరిస్తామని ప్రకటన చేశారు. తిరుపతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరమణ హఠాన్మరణం చెందడంతో అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ నెల 13న పోలింగ్ జరగనుండగా, 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా, సుగుణమ్మ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని టీడీపీ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేయగా, కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని బరిలో దింపింది.