: అవిభక్త కవలలు వీణా-వాణీలకు లండన్ డాక్టర్ల వైద్య పరీక్షలు


అవిభక్త కవలలైన వీణా, వాణిలను వేరు చేసేందుకు మరోసారి ప్రయత్నం జరగబోతోంది. లండన్ లోని ప్రఖ్యాత గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్య బృందం డునావే, జిలానీలు ఈరోజు హైదరాబాదులోని నీలోఫర్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజులపాటు వారిద్దరికీ పూర్తిగా పరీక్షలు జరుగుతాయి. తరువాత వారిని విడదీసేందుకు అవకాశం ఉందా? లేదా? అన్న విషయాన్ని తేలుస్తారు. అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, ఇతర ఉన్నతాధికారులు, తల్లిదండ్రులతో లండన్ వైద్య బృందం చర్చలు జరుపుతుంది. అన్నీ సరిగా ఉంటే వీణ, వాణీలను లండన్ తీసుకెళ్లి శస్త్రచికిత్స చేసే అవకాశముందని తెలుస్తోంది. దానికి రూ.25 కోట్లనుంచి రూ. 50 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News