: రంజీ ట్రోఫీలో ఆంధ్రా బ్యాట్స్ మన్ శ్రీకర్ భరత్ రికార్డు
ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కళాశాల మైదానంలో ఆంధ్రా, గోవా జట్ల మధ్య రంజీ మ్యాచ్ లో ఆంధ్రా ఆటగాడు శ్రీకర్ భరత్ రికార్డు సృష్టించాడు. రంజీ క్రికెట్ చరిత్రలోనే ఆంధ్రా నుంచి తొలి త్రిశతకం నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుపుస్తకం ఎక్కాడు. మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి (నిన్నటికి) 226 పరుగులతో అజేయంగా నిలిచిన భరత్ నేడు ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అనంతరం 308 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. లంచ్ సమయానికి ఆంధ్రా జట్టు 120 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 548 పరుగులు చేసింది.