: కృష్ణాతీరంలో కట్టడాలు నిర్మించిన బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజుకు నోటీసులు


నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో కృష్ణానది తీరంలో అక్రమ కట్టడాలు నిర్మించిన వారిపై అధికారులు చర్యలు ప్రారంభించారు. మొత్తం 55 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించిన తాడేపల్లి రెవెన్యూ సిబ్బంది 21 మందికి నోటీసులు జారీ చేశారు. వీరిలో బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు కూడా ఉన్నారు. ఆయనతోపాటు ఆయన సోదరుడికి, లైలా ప్రాపర్టీస్‌ లిమిటెడ్‌ ప్రతినిధులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల శంకుస్థాపన జరుపుకున్న బీజేపీ కార్యాలయానికి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ ప్రాంతంలో స్థలాలకు సంబంధించిన అనుమతుల పత్రాలను నెల రోజుల వ్యవధిలో తహశీల్దార్‌ కార్యాలయానికి అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News