: అత్యధికులు వీక్షించిన ట్రైలర్ గా 'పీకే'
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన 'పీకే' యూట్యూబ్ లో బాగా వీక్షించిన ట్రైలర్స్ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. గతేడాది అక్టోబర్ లో రిలీజ్ అయిన రెండు నిమిషాల 13 సెకండ్ల ఈ ట్రైలర్ ను ఒక కోటి 22 లక్షల మందికి పైగా వీక్షించినట్టు యూట్యూబ్ తెలిపింది. తరువాతి స్థానాల్లో అజయ్ దేవగణ్ 'యాక్షన్ జాక్సన్', బిపాషా బసు హారర్ చిత్రం 'ఎలోన్', అర్జున్ కపూర్ నటించిన 'తేవర్', దర్శకుడు శంకర్ తమిళ చిత్రం 'ఐ', అక్షయ్ కుమార్ 'బేబీ', అర్జున్ రాంపాల్ 'రాయ్' చిత్రాల ట్రైలర్లు నిలిచాయి.