: జూలియన్ అసాంజే కాపలా కోసం రూ.94 కోట్లు ఖర్చు చేసిన బ్రిటన్


ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో శరణార్ధిగా ఉన్న వీకీలిక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే (43)ను కాపలా కాసేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.94.60 కోట్లను ఖర్చు చేసింది. 2012లో అసాంజే లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. స్వీడన్‌లో లైంగిక ఆరోపణల కేసు ఎదుర్కొంటున్న అసాంజే దౌత్య కార్యాలయం నుంచి బయటకు వస్తే అరెస్టు చేసేందుకు స్కాట్‌లాండ్ యార్డు పోలీసులు నిరంతర పహారా కాస్తున్నారు. అసాంజే కాపలాకు రోజుకు రూ.9.50 లక్షలు ఖర్చు అవుతోందని సమాచార హక్కు చట్టం వినియోగించుకొని ఎల్బీసీ రేడియో అధికారిక సమాచారాన్ని సేకరించింది. విదేశీ దౌత్య కార్యాలయాల రక్షణ కింద ఈ నిధులు పొందుతున్నట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News