: హిజ్రాల నృత్యాలతో బెంబేలెత్తుతున్న పన్ను ఎగవేతదారులు


రోజురోజుకూ పెరిగిపోతున్న ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు చెన్నై కార్పొరేషన్ అధికారులు వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. నోటీసులిచ్చినా స్పందించని స్టార్ హోటళ్ల ముందు హిజ్రాలతో నృత్యాలు చేయించే పనిలో పడ్డారు. చెన్నై కార్పొరేషన్ పరిధిలోని అనేక స్టార్ హోటళ్లు, మాల్స్, ఇతర ప్రైవేటు సంస్థలు ఆస్తి పన్నుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో బకాయిలు కొండంత పేరుకుపోయాయి. వీటిని వసూలు చేసేందుకు ఆయా భవనాల ముందు దండోరా వేయిస్తున్నారు. ఈ క్రమంలో, వారి బకాయిల వివరాల్ని వెల్లడిస్తూ, కొందరు హిజ్రాలను నియమించుకుని, వారి ద్వారా ఆయా భవనాల ముందు స్టెప్పులు వేయించే పనిలో పడ్డారు. ఈ ప్రయోగం విజయవంతం అయింది. నేటి ఉదయం ఈక్కాడు తాంగల్‌ లోని ఓ హోటల్ ముందు హిజ్రాలతో నృత్యం చేయిస్తూ, దండోరా వేయించగా, ఆగమేఘాలపై అక్కడికక్కడే తమ పన్ను బకాయి రూ.30 లక్షల చెక్కును హోటల్ యాజమాన్యం అధికారులకు అందజేసింది. ఇదే ఉత్సాహంతో, మరిన్ని బకాయిల వసూళ్లకు కార్పొరేషన్ అధికారులు నడుం బిగించారు.

  • Loading...

More Telugu News