: ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేయాలంటూ మోదీ ట్వీట్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలో ఓటు వేసేందుకు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. "నేడు ఢిల్లీ ఓటింగ్ సందర్భంగా, భారీగా వెళ్లి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేకంగా రికార్డు స్థాయిలో ఓటు చేయాలని నా యువ స్నేహితులకు పిలుపునిస్తున్నా" అని మోదీ ట్వీట్ చేశారు. అటు హిందీలో కూడా ప్రధాని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 10 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదైంది.

  • Loading...

More Telugu News