: కాంగ్రెస్ పాదయాత్రకు అనుమతి నిరాకరణ... గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలన్న కేసీఆర్ ఆలోచనలను నిరసిస్తూ, తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో రాజ్భవన్ వరకూ తలపెట్టిన పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. తమను ఎవరూ లిఖిత పూర్వక అనుమతి కోరలేదని అధికారులు వివరించారు. కాగా, తాము అనుమతి కోరినప్పటికీ పోలీసులు నిరాకరించారంటూ ఆరోపించిన కాంగ్రెస్ నేతలు పాదయాత్ర నిర్వహించి తీరుతామని గాంధీభవన్ కు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, గాంధీభవన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పాదయాత్రలో పాల్గొనే నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. దీంతో, గాంధీభవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.