: నేడు కర్నూలులో ఓ పెళ్లికి హాజరవుతున్న జగన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ నేడు కర్నూలు వస్తున్నారు. విశ్వభారతి హాస్పిటల్స్ అధినేత డి.కాంతారెడ్డి, అనురాధ దంపతుల కుమార్తె నిహారిక వివాహానికి ఆయన విచ్చేస్తున్నారు. ఈ వివాహం నందికొట్కూరు రోడ్డులోని ఎస్.ఎస్.గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరగనుంది. వివాహం ముగిసిన తర్వాత జగన్ ఈ సాయంత్రం హైదరాబాద్ తిరిగి వస్తారు. కాగా, జగన్ రాక సందర్భంగా పార్టీ నేతలు ఆయనను కలిసి జిల్లాలో పార్టీ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.