: ఓటు హక్కు వినియోగించుకున్న కిరణ్ బేడీ, రాష్ట్రపతి తనయ శర్మిష్ఠ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఊపందుకుంది. బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయ శర్మిష్ఠ ముఖర్జీ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శర్మిష్ఠ కాంగ్రెస్ తరపున గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు.